విద్యాసేవ – సేవ https://sevalive.com SEVA LIVE Tue, 06 Aug 2024 10:28:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 31484547 డొక్కా సీతమ్మ https://sevalive.com/2024/08/06/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/ https://sevalive.com/2024/08/06/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/#respond Tue, 06 Aug 2024 10:28:47 +0000 https://sevalive.com/?p=104 డొక్కా సీతమ్మ

ఆంధ్రదేశంలో కొంత కాలం క్రితం వరకు డొక్కా సీతమ్మగారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె అన్నదానం ఖ్యాతి ఖండ ఖండాంతరాల్లో నూ వ్యాపించింది. ఆమె గురించి ఈ కాలం వారికి పెద్దగా తెలిసి ఉండకపో వచ్చు ఇప్పుడు ఆమెను గురించి కాంచెం తెలుసుకుందాం..

డొక్కా సీతమ్మగారు తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరంలో 1841 లో జన్మించింది. ఆమె తండ్రి అనప్పిండి
భవానీ శంకరుడు… తల్లి నరసమ్మ. వీరి వంశం వారు ఇప్పటికీ లంకలగన్నవరంలో ఉన్నారు.

సీతమ్మ బాల్యం నుంచి వితరణ స్వభావం కలది. పుట్టినింటి వారు అంత సంపన్నులు కారు. సీతమ్మగారు ఉన్నంత లోనే పేదసాదలకు అన్నం పెట్టేది సాయం చేసేది. ఆమెభర్త డొక్కా జోగన్నగారు. అత్తింటివారు సంపన్నులు కావటంతో సీతమ్మగారు భర్త అనుమతితో దానధర్మాలు చేస్తూ ఉండేది. అన్నదానం చేయడంలో ఈమెకు ఎక్కువ ప్రీతి. గొప్ప, బీద,జాతి, మత, కుల భేదాలు లేకుంగా ఏ వేళకు వచ్చి అన్నం అడిగినా లేదన కుండా, విసుక్కోకుండా వాళ్ళని ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తి పరచేది. ఈ విషయంలో భర్త కూడా అమెకు అన్ని విధాలా సాయపడుతూ ఉండేవాడు. .

సీతమ్మగారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు, గాథలు ఆంధ్రదేశంతో ప్రచారంలో ఉన్నాయి. సంతానం లేని ఒక జిల్లా కలెక్టరు సీతమ్మ గారి చేతి చలువ అన్నం వల్లనే తనకు సంతానం కలిగిందని విశ్వసించేవాడు, ‘ధాత’ కరువు వచ్చినప్పుడు ఈ దంపతులు చేసిన అన్నదానం గురించి చాటు కవులు ఎన్నో విధాల ప్రసంసించారు.

ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి బాగా ముసురు పట్టి వర్షం కురుస్తోంది. దానికి తోడు గోదావం పొంగి ప్రవహిస్తోంది. ఒక హరిజనుడు గోదావరి లంకలో చిక్కుకు ని, ఆకలితో అలమటిస్తూ గొంతెత్తి ‘అమ్మా, సీతమ్మ తల్లి ఆకలి తో ప్రాణం పోతోందమ్మా – అన్నం పెట్టి పుణ్యం కట్టుకోమ్మా’ అని ఆక్రోశిస్తున్నాడట. ఎలాగో ఆ ఆక్రోశం సీతమ్మగారి చెవుల పడింది. వెంటనే ఆమె బయలుదేరింది. ఆ వర్షంలో ఆ గోదావరిలో అన్నం కుండ నెత్తి మీద పెట్టుకుని భర్త సాయంతో ఆ లంక లోకి వెళ్ళి, ఆ హరిజనుడికి అన్నం పెట్టి, ఆకలి తీర్చి, అతడిని వెంటపెట్టుకు ని గోదావరి దాటించి తన ఇంటికి తీసుకు వచ్చి కాపాడింది.

ఒకసారి ఒక దొంగ సీతమ్మ గారి ఇంటికి వచ్చి ఆమె పట్టు చీర దొంగిలించాడు. చుట్టు పక్కల వారు కనిపెట్టి, దొంగని పట్టుకుని కట్టేసి కొట్టబోయారు. సీతమ్మ గారు వారిని వారించి ఆ దొంగని కట్లు విప్పించి, వాడికి అన్నం పెట్టి ఆ పట్టు చీర తానే స్వయంగా ఆ దొంగకి ఇచ్చి పంపించిందట.

మరోసారి సీతమ్మగారు అంతర్వేది తీర్థానికి మేనాలో బయలుదేరింది. దారి లో పెళ్ళివారి గుంపు ఒకటి ఎదురైంది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ
‘సీతమ్మగారు ఊళ్ళో లేదు. అమే వుంటే మనల్ని ఇలా అభోజనంగా పంపించేదా’ అనుకుంటున్నారుట. సీతమ్మగారు అ మాటలు విని, మేనా దిగి వారి సంగతి కనుక్కుని, తాను వెనక్క తిరిగి ఆ పెళ్ళి వారిని వెంటపెట్టుకుని ఇల్లు చేరి అప్పటి కప్పుడు అంతమందికీ వంట చేసి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది.

సీతమ్మగారి అన్నదాన వ్రతనిష్ఠును పరీక్షించడానికి ఒకరోజు రాత్రి పిఠాపురం రాజా గంగాధరరావుగారు, తమ దివాను తో కూడా మారు వేషాలతో వెళ్ళి సీతమ్మ గారి ఇంటి వీధి అరుగు మీద పడుకున్నా రుట – రాత్రి తలుపులు వేసుకోవడానికి వచ్చిన సీతమ్మగారు అరుగుల మీద కొత్త వారిని చూని లోపలికి వచ్చి భొజనం చేసి పడుకోండి’ అన్నది. వారిద్దరు తమకు ఆరోగ్యం బాగాలేదని అన్నారుట. ఫరవా లేదు, మికు పథ్యంగానే వండిపెడతానని వాళ్ళని లోపలికి తీసుకువచ్చి ఆ రాత్రి వేళ పథ్యం వంట చేసి పెట్టిందిట సీతమ్మగారు.

సీతమ్మగారి అన్నదాన ప్రశస్తి అనాటి బ్రిటిషు చక్రవర్తి ఏడో ఎడ్వర్డ్ గారికి తెలిసింది. ఆయన ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ యోగ్యతా పత్రాన్ని పంపించా రుట. అంతేకాకుండా ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం లండన్ లో జరిగే చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లో దర్బారు హాల్లో సీతమ్మ గారి ఫొటో పెట్టేందుకు ఆదేశించారుట.

అలా ఆ ఫోటో కోసం ఒకే ఒక్కసారి కెమెరా ముందు కుర్చీలో కూర్చుని ఫోటో దిగారు సీతమ్మగారు.

సీతమ్మగారి వలె ఆదరించి అన్నం పెట్టే తల్లుల మూలంగానే ఆంధ్రదేశం అన్నపూర్ణ అయింది.

0Shares
]]>
https://sevalive.com/2024/08/06/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/feed/ 0 104
మార్పు అనివార్యం https://sevalive.com/2024/08/05/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/ https://sevalive.com/2024/08/05/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/#respond Mon, 05 Aug 2024 10:24:46 +0000 https://sevalive.com/?p=69 మార్పు అనివార్యం
‘మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్ద’ అన్నారు భౌతిక, తత్త్వ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ‘మార్పుకు అనుగుణంగా ఎవరైతే మారగలిగారో వారే తెలివైనవారు’ అన్నది నగ్న సత్యం. జీవితం చాలా గొప్పది. అది ఎంతో నేర్పిస్తుంది. ఎన్నో మార్పులు తెస్తుంది. అయితే ఆ మార్పునకు అనుగుణంగా మనలో మార్పులు అవసరం. పుట్టినప్పటినుంచి చివరిదాకా మనిషి నేర్చుకొంటూనే ఉంటాడు. తెలివైనవాడు ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉంటాడు. మార్పులు ద్వారా ఇంకా నేర్చుకొంటుంటాడు. జీవితం కూడా నేర్చుకోమని చెపుతుంది. మారమని చెపుతుంది. నిత్యం కొత్తదనంతో కొత్తకోణంలో ఉజ్వల భవిష్యత్తుకై ఆలోచించండి. అలా ఆలోచించేది కూడా పెద్దదిగా ఆలోచించండి. మార్పుకోసం చేసే పయనంలో కొన్ని లోటుపాట్లవల్ల ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు. వాటిని మన సంపత్తితో మరింత ఆలోచనతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు.


మహనీయుల విజయగాథలు తెలుసుకొని మారాల్సిన అవసరం ఉందని గుర్తించారు మేధావులు. ఈ కోవలో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ‘ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం’ ఇదే! కాంతికంటే వేగంగా ఏదీ ప్రయాణించలేదని, అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుందని ఐన్‌స్టీన్ గుర్తించాడు.
న్యూటన్ కాలాన్ని ఒక నదీ ప్రవాహంగా భావించాడు. అది వింటిని వదలిన బాణంలాగా గతం నుండి వర్తమానం గుండా భవిష్యత్తు వైపుకు అవిచ్ఛిన్నంగా, ఏక రూపంగా ప్రయాణిస్తుందనీ, దాని గతి ఏ కారణంగానూ మారదని చెప్పాడు. కానీ ఐన్‌స్టీన్ కాలమనే నదీ ప్రవాహం ఏకరీతిగా సాగదని, గ్రహాలూ, నక్షత్రాలు, గెలాక్సీల వంటివాటిలో సమక్షంలో అది వంపు తిరుగుతుందని, వాటి చుట్టూ కాలం వేగంగా సాగడమో లేక నిదానంగా సాగడమో జరుగుతుందని తెలిపాడు. సముద్రంలో ఈదే చేప తన చుట్టుప్రక్కల వున్న నీటిని ఎలా వెనక్కి నెడుతుందో అలాగే ఒక నక్షత్రము లేదా తోకచుక్క లేదా గ్రహము తను ప్రయాణించే అంతరిక్షంలో దాని దిక్కాలలో మార్పును తీసుకువస్తుంది. దిశ, కాలాలు వేర్వేరు కావు. అవి ఒకటి లేకుండా ఒకటి మనలేవు అని ఐన్‌స్టీన్ నిరూపించారు.

మనం చూస్తున్నవాటిల్లో కొన్ని ఎన్నడూ మారనట్లు, నిత్యం తెల్లవారడం పొద్దుకుంగడం, సూర్యోదయం, సూర్యాస్తమయం గమనిస్తాం. కొండలు సముద్రాలు అలాగే వుంటాయి. కాని మనం మాత్రం మారుతుంటాం. పుట్టుక, పెరుగుదల, మరణం మార్పులో భాగమే. అలాగే కొన్ని వస్తువులు తుప్పుపడుతుంటాయి. మరికొన్ని శిథిలమవుతుంటాయి. మారనిది అంటూ ఏదీ లేదు. ఎంతసేపట్లో మారతాయనేదే ప్రశ్న. మార్పుకు పట్టే కాలాన్ని బట్టి కొన్ని అసలు మారనట్లే అన్పిస్తాయి. మార్పుతో ముడిపడి కాలం వున్నది. మనం దీనినే గతం, వర్తమానం, భవిష్యత్తు అని విభజించాం. భౌతిక విజ్ఞానం గతం- భవిష్యత్తునే పేర్కొంది. కాలాన్ని విడిగా చూచిన తీరును ఐన్‌స్టీన్ మార్చేసి, కాలం ప్రదేశం కలిపేడు. ఈ ప్రపంచలో ఎన్నో వస్తువులు ఉండగా వాటిలో మార్పులు వివిధ రకాలుగా కనిపిస్తున్నవి. సైన్సులోని భిన్న శాఖలు ఆయా రంగాలలోని మార్పుల్ని అధ్యయనం చేసి చెబుతున్నాయి.

ఒకప్పుడు న్యూటన్ ప్రపంచంలో వున్న మనం ఇప్పుడు ఐన్‌స్టీన్ విశ్వంలో అడుగుపెట్టాం. మన భావాలెన్నో మార్చుకోవలసి వస్తుంది. ఖగోళ శాస్త్ర పరిశోధనలు మన సంప్రదాయ ఆలోచనల్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి. మార్పు పరిణామంలో ఆధునిక భావాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మనమూ మారుతున్నాం.. మారాలి.. మార్పు కోసం మారాలి. వివేకంతో ఎవరైతే మారగలరో వారే అత్యుత్తమ ఫలితాలతో ఘనవిజయాన్ని సాధిస్తారు. మారకపోతే మాత్రం జీవితంలో వారి ఎదుగుదల వుండదు. ఈ సమాజంలో తెలివైనవారుగా గుర్తింపు పొందరు. లేదంటే, గొంగళిపురుగుగా మారుతారు ఎక్కడి గొంగళి అక్కడేలా.. అదే మార్పు వైపు అడుగులు వేస్తే గొంగళిపురుగు దశనుంచి సీతాకోక చిలుక చందాన పరిణామం చెందుతారు. ఉజ్వల భవిష్యత్తును చవిచూస్తారు.
నాటినుంచి నేటివరకు తెలివైనవారు ఎందరో మారడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాలచక్రంలో, మారుతున్న కాలంతో, ఎన్నో ఎనె్నన్నో మార్పులు వచ్చాయి. మానవ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వందసార్లు విఫలమైనా పట్టువదలని విక్రమారుడిలా మార్పులు చేస్తూనే, చివరికి తన మేధోసంపత్తితో థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నారు. విద్యుత్ కనుగొన్నందున జీవనశైలి మారింది. ఇలా ఒకటేమిటీ ఎన్నో మార్పులు వచ్చాయి… వస్తున్నాయి.. ఇంకా వస్తాయి. తెలివితేటలతో మార్పుకోసం పయనిస్తే మన జీవన విధానంలో ఇంకా అనేక మార్పులు కూడా చోటుచేసుకుంటాయి.
ప్రపంచంలో మార్పులు రావాలని, మార్పులు తీసుకురావాలని ఎనె్నన్నో చెబుతారు. కానీ తనదాకా వచ్చేసరికి దాన్ని ఆచరించరు. మార్చగల సామర్థ్యం ఒకరి తెలివితేటలను నిర్ణయిస్తుందనేది పచ్చి నిజం. మార్పు గొప్ప గుణం. మార్పును స్వీకరించగలిగితే ఏదైనా సాధించవచ్చు. మార్పు రావటం అనేదే తెలివితేటలకు నిదర్శనం. విజయం అనేది అంత సులభం కాదు. కష్టపడితేనే వస్తుంది. తన భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవాలంటే తన ఆలోచనలను, అలవాట్లను దృక్పథాన్ని మార్చుకోవాలి. పట్టుదల, కృషి వుంటే మార్పుతో అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది.
నిన్నటిరోజు ఈ రోజు రాదు. అలా వుండదు. కాబట్టి మార్పు అవసరం. మార్పుకు అనుగుణంగా మారాలి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక్క మార్పు తప్ప. కాలక్రమంలో ఈ మార్పులను గుర్తించినవాడే చార్లిస్ డార్విన్. ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది ఆయన జీవ పరిణామ సిద్ధాంతమే భూమిమీది జీవుల పరిణామక్రమాన్ని తెలియజేస్తుంది. భూమిపై జీవజాలం ఏ విధంగా పరిణామక్రమం చెందాయి అనే విషయంపై పరిశోధనలు చేశాడు. జీవపరిణామ సిద్ధాంతాన్ని వర్ణించాడు.
బాబాసాహెబ్ అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలామ్ లాంటివారు ఎందరో మార్పుకోసం పాటుపడినవారే. ఇలాంటి మేధావుల విజయగాథలను స్ఫూర్తిగా తీసుకొని మనం మారుతూ.. మారుకోసం కృషి చేస్తూ తెలివైనవాడిగా సమాజంలో గుర్తింపు పొందుతారు.
అభివృద్ధి సాధించాం అంటే.. మార్పు కోరుకోవటమే. ఇపుడు అన్ని రంగాలలోనూ అనేక మార్పులు వచ్చాయి. నాటి తాళపత్ర గ్రంథాల స్థాయి నుంచి పుస్తక ప్రతుల స్థాయికెదిగి తాజాగా అంతర్జాలం వరకు మార్పు చోటుచేసుకొంది.

నేటి సమాజంలో మార్పు రావాలంటే ముందు మనం మారాలి. మన ఆలోచనలు మారాలి. మన ఇంట్లో ఉండేవారు మారాలి. మన చుట్టూ ఉండేవారు మారాలి. ప్రతిఒక్కరిలో మార్పు రావాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.
మార్పు అనివార్యం. అదే తెలివైనవాడి లక్ష్యం. ఆ లక్ష్యం ఏర్పడాలి. ఆ లక్ష్యమే తెలివైనవారిగా తీర్చిదిద్దుతుంది. అందుకే అందరిలో మార్పును కోరుకుందాం. మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్దగా నిలుద్దాం!

– కంచర్ల సుబ్బానాయుడు

0Shares
]]>
https://sevalive.com/2024/08/05/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/feed/ 0 69