సకలసేవ – సేవ https://sevalive.com SEVA LIVE Wed, 12 Feb 2025 07:41:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 జంతువులే నయం! https://sevalive.com/2025/02/12/%e0%b0%9c%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2%e0%b1%87-%e0%b0%a8%e0%b0%af%e0%b0%82/ https://sevalive.com/2025/02/12/%e0%b0%9c%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2%e0%b1%87-%e0%b0%a8%e0%b0%af%e0%b0%82/#comments Wed, 12 Feb 2025 07:41:29 +0000 https://sevalive.com/?p=246 జంతువులే నయం!

-- డా.పివిఎల్ సుబ్బారావు.

వానర, జాగిల ,
మార్జాల త్రయం!

జాతిభేదం,
మరిచి ఒకటైన వైనం!

నేడు ముగ్గురు మనుషులు, ఒకటైతే అద్భుతం!

ఏ ఇద్దరి మధ్య
ఏకాభిప్రాయం ఓ అనృతం!

మనుషులంతా ,
ఎవరికి వారే యమునా తీరే!

కోతి నుండి పుట్టాడు,
మనిషి అంటారు!

వానరుడే నయమని అంగీకరిస్తున్నారు అందరూ!

తోక ఒక్కటి తక్కువ ,
అన్ని ఆ అవలక్షణాలే!

హనుమంతుడు ,
ఎదిగిన ఆదర్శవానరుడు!

మరి కోతి కన్నా ,
దిగజారాడు ఈ మానవుడు!

కుక్కకి ఉన్న విశ్వాసము, విశ్వాన విఖ్యాతము!

మనిషి కుక్కని నమ్మితే జీవితాంతము స్నేహము!

మనిషి మనిషిని నమ్మితే అడుగడుగునా ద్రోహము!

అన్నం పెట్టిన వాడికి,
ప్రాణం పెట్టేది ఒక్క కుక్కే!

ప్రాణం పెట్టినా మనిషి
అన్నం పెట్టడు గొప్ప చిక్కే!

పిల్లికి పాలు పోస్తే,
మన ఇంటే ఉంటుంది !

ఎలకల్ని పట్టి,
ఎంతో మేలు చేస్తుంది!

పిల్లలతో కలిసి,
ఇల్లంతా తిరుగుతుంది!

మన పిల్లలకు చేరువై,
ఎంతో మురిపిస్తుంది!

చిన్న మొహంతో ఉన్న ,
పెద్ధపులి మన ఇంటి పిల్లి!

జంతు ప్రపంచాన,
మనిషికే వింత పోకడే!

స్వధర్మాలు మరిచిన,
జీవి వాడు ఒక్కడే!
యుగాలుమారినా,మారనివి,
జంతువుల స్వభావాలే!

జీవ పరిణామం,
మానవ నాగరికతా వికాసం!

మానవత్వం ఏ మాత్రం ?
వీడని గొప్ప సందేహం!

డా పివిఎల్ సుబ్బారావు.
విజయనగరం.

0Shares
]]>
https://sevalive.com/2025/02/12/%e0%b0%9c%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2%e0%b1%87-%e0%b0%a8%e0%b0%af%e0%b0%82/feed/ 11 246
ప్రేమే… మా లక్షణం https://sevalive.com/2025/02/12/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b1%87-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82/ https://sevalive.com/2025/02/12/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b1%87-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82/#respond Wed, 12 Feb 2025 07:35:46 +0000 https://sevalive.com/?p=247 ప్రేమే… మా లక్షణం
డా. పొట్లూరి రవి కిరణ్!!

జాతి వైరమే లేదు…జన్మ కోరినది కాదు!!
జంతువులము మేము… జగడాలెరుగము మేము!!
ఆజన్మ శతృత్వమంటారు అందరూ!!
ఆ జన్మ మైత్రి కోసమే…అంటాము మేము!!

జాతి వేరైన…జక్కలించము మేము!!
జాతి వైరమెంచి…వెక్కిరించము మేము!!
ప్రాంతమేదైన…ప్రాణ మిత్రులమే!!
ప్రాభవమేదైన…ప్రేమ మూర్తులమే!!

కులము లేదు మాకు…కుళ్ళు కాన రాదు!!
మతము లేదు మాకు…మాత్సర్యమే లేదు!!
వర్ణమెరుగము మేము..‌.మర్మమెరుగము!!
వర్గమెరుగము మేము…వేరు కాము!!

కలిసి మెలిసి ఉంటాము…కలతలు లేక!!
కలిసి మెసలుతుంటాము…కొలతలు లేక!!
ప్రకృతి మాలో…ప్రవర్థిల్లు ప్రతీ క్షణం!!
ప్రకృతి మాతలో…ప్రభవించే ప్రతీ క్షణం!!
ప్రేమే… మా లక్షణం!!
ప్రేమే… మాలో విలక్షణం!!

  • డా. పొట్లూరి రవి కిరణ్
    పోరంకి
0Shares
]]>
https://sevalive.com/2025/02/12/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b1%87-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%82/feed/ 0 247
ప్రేమ పరిమళాలు https://sevalive.com/2025/02/12/prema-parimlalu/ https://sevalive.com/2025/02/12/prema-parimlalu/#respond Wed, 12 Feb 2025 07:17:52 +0000 https://sevalive.com/?p=226 ప్రేమ పరిమళాలు

  • డా. బి.వి.వి. సత్యనారాయణ

కమ్మనైన అమ్మతనం కంటేనే రాదురా
ప్రేమపంచే ప్రతీప్రాణి అమ్మవంటిదేనురా
జాతివైరమ్ము విడిచి ఒక్కటైనారురా
జంతువేదైనా దాగిన ప్రేమను పసిగట్టరా !!

కుక్కల కోతి పిల్లి చూడ చ్చకనైన సావాసం
కలసి మెలసి బ్రతకటము కమ్మనైన అనుభూతి
నోరులేని జీవాలు నేర్పేను పాఠాలు
చూసి నేర్వుము నీవు మంచి గుణపాఠాలు !!

ప్రేమలో దాగి ఉంది పసిడి పరిమళాలు
పంచగానె తెలుస్తుంది దాని పరవశాలు
అనుభవిస్తే అర్ధమౌను దానిలోని ఆనందాలు
ప్రేమకున్న గొప్పదనం ప్రపంచాన కానరాము !!

జంతువులని తేలికగా చులకనగా చూడమాకు
వాటి ఆత్మీయత అనురాగం ఎన్నటికీ మరువబోకు
నేర్చుకునే తత్వాన్ని స్వీకరించి నడుచుకో
జీవితపరమార్ధం వీటినుండి నేర్చుకో
పంచడంలో ఆనందం అనుభవించి తెలుసుకో
ఈ చిత్రాన్ని చూసైనా మానవత్వంతో మసలుకో !!

  • డా. బి.వి.వి. సత్యనారాయణ
    అమలాపురం
0Shares
]]>
https://sevalive.com/2025/02/12/prema-parimlalu/feed/ 0 226
ఆలోచనలను ఎలా మలచుకోవాలి? https://sevalive.com/2024/08/07/%e0%b0%86%e0%b0%b2%e0%b1%8b%e0%b0%9a%e0%b0%a8%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%8e%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b2%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf-2/ https://sevalive.com/2024/08/07/%e0%b0%86%e0%b0%b2%e0%b1%8b%e0%b0%9a%e0%b0%a8%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%8e%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b2%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf-2/#respond Wed, 07 Aug 2024 03:41:00 +0000 https://sevalive.com/?p=108 ఆలోచనలను ఎలా మలచుకోవాలి?
ప్రతి ఒక్కరిలోనూ శక్తి సామర్థ్యాలనేవి ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ బలహీనతల్ని, సమస్యల్ని అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులు పటిష్టం చేసుకోవడంకోసం, అంతిమవిజయం సాధించట కోసం మీ ఆలోచలను మార్చుకోవచ్చు. మంచి ఆలోచనలతో మనల్ని మనం మలచుకోవడంలోనే విజయం దాగివుంది. ఒక లక్ష్యంతో ఆలోచనలవైపు, ఆచరణవైపు అడుగులు పడితే విజయం మీ స్వంతం.
ఆలోచనలే ఆచరణగా పరిణమిస్తాయి. ప్రతి వ్యక్తి బహ్యప్రవర్తనకు మూలాలు ఆలోచనల్లోనే ఉంటాయి. ఆలోచించకుండా అసంకల్పితంగా ఏపనీ ఎవరూ చేయలేరు. క్లుప్తంగా చెప్పాలంటే మనిషి కృషి వెనుక వున్న అసలైన శక్తి ఆలోచనా స్రవంతే కాబట్టి వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఆలోచనలకు చాలా ప్రాముఖ్యం ఉంది.

ఆలోచనలనేవి రెండువైపులా పదును వున్న కత్తి లాంటివి. అవి మనిషిని ఎంత ఉత్తేజపరచగలవో అంత నిరాశపరచగలవు. ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని జయిస్తాడా? లేక లక్ష్యంచే జయించబడతాడా? అనే విషయాన్ని అతని ఆలోచనాసరళిని బట్టి తేలిగ్గా చెప్పవచ్చు.
జయాపజయాలనేవి కేవలం ఆలోచనా జనితాలు తప్ప బాహ్య శక్తులచే నిర్ణయించబడే దృగ్విజయాలు కావు. అసలు ఒక మనిషి విజయం సాధించడానికి కావాల్సింది ఇతరుల సహకారమో లేక పరిస్థితులు అనుకూలించడమో కాదు. నిజానికి అవి ప్రతికూలంగా పనిచేసినా అతని ఆలోచనలు సహకరిస్తే చాలు విజయం దానంతట అదే సిద్ధిస్తుంది. అందుకే ప్రపంచ చరిత్రంతా కేవలం కొద్దిమంది ఆలోచనాపరుల చరిత్రేనని భావిస్తారు. జీవితంలో ఇంత ప్రాముఖ్యం ఉన్న ఆలోచనల పట్ల చాలామంది నిర్లక్ష్యభావం వహిస్తారు. ఇలాంటివారు ఆలోచనలను సవ్యమైన రీతిలో మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా వీరి యోచనా స్రవంతిలో అనవసర అంశాలే ఎక్కువగా చోటుచేసుకుంటాయి.
సగటు మనిషి తన జీవితంలో ఇంచుమించు సగభాగాన్ని అనవసర ఆలోచనాలతోనే వృధా చేస్తాడని అంచనా! ఆలోచనలు ఎంత ఉపయుక్తమైనవో, అంత ప్రమాదకరమైనవని మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతుంది. అందుకే ఆలోచనాస్రవంతిని వరదనీటితో పోలుస్తారు. కట్టలువేసి వరద నీటిని జాగ్రత్తగా వినియోగించుకొంటే బీడు భూములు సుక్షేత్రాలవుతాయి. అలా వదిలేస్తే అవి మరుభూములుగా మారుతాయి. అలాగే ఆలోచనలను అదుపు చేసి సక్రమ మార్గంలో నడిపిస్తే మనోక్షేత్రం సస్యశ్యామలవుతుంది. లేకుంటే ఎడారిగా మారుతుంది. కాబట్టి ఆలోచనలను అదుపుచేయడం, అవసరాలకు అనుగుణంగా మలుచుకోవడం అవసరం.
మనం ఆలోచనలకు లొంగిపోవడంకంటే, ఆలోచనలను మనకు అనుకూలంగా మలుచుకోవడం ఉత్తమం. అనుకూలమైన ఆలోచనలంటే మన లక్ష్యానికి, చేస్తున్న కృషికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం. మనిషి తన ఆలోచనలపై పట్టు సాధించడమంటే ఇదే! ఆలోచనలను అదుపు చేసుకోగలిగిన వ్యక్తి దేనినైనా సాధించగలుగుతాడు. ఇంట గెలిస్తేనే కదా రచ్చ గెలిచేది? అయితే చాలామంది ఈ విషయాన్ని గుర్తించలేరు. లక్ష్యానికి అనుగుణంగా ఆలోచనలను మలచుకోలేకపోవడం వల్ల వీరి బాహ్యప్రవర్తనకూ, అంతర ప్రవృత్తికీ మధ్య ఎడతెగని ఘర్షణ జరుగుతుంది. ఈ విధమైన ద్వంద్వత్వంవల్ల సర్వశక్తులు లక్ష్యంపైకి కేంద్రీకరించడం కుదరదు. వ్యతిరేక ఆలోచనా స్రవంతి ప్రయత్నాన్ని అడ్డగించి, లక్ష్యాన్ని దారుణంగా నీరుగారుస్తుంది. నూటికి తొంభై మంది అభ్యర్థులు తమ లక్ష్యానికి అనుగుణంగా కృషి చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఇదే.
అయితే తమ ఆలోచనాసరళిని మార్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తే ‘మార్పు’ అనేది తనంతట తనే వస్తుంది. ముందుగా మనసుపై అదుపు సాధించడం మానవమాత్రులకు సాధ్యమయ్యేది కాదు. అది ఋషులకు మాత్రమే సాధ్యం అనే భావనను వదిలిపెట్టాలి. కృషి వుంటే మనుషులు ఋషులవుతారన్నాడో కవి. కృషి వుంటే మనిషి సాధించలేనిదంటూ ఏమీ ఉండదని గ్రహించాలి. తలచుకొంటే ఎవరైనా తమ ఆలోచనలను మార్చుకోవచ్చన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఇది శాస్ర్తియంగా కూడా నిరూపణ అయింది.
ఒకరకంగా మనిషి మస్తిష్కం కూడా కంప్యూటర్ వంటిదే! దీనిలోకి ఎలాంటి ఆలోచనలు ప్రవేశపెడితే తిరిగి అలాంటి ఉత్పత్తి వస్తుంది. పుట్టిన ప్రతి మనిషి మస్తిష్కం కూడా శూన్యంతో ఇంటరాక్షన్ పెరిగిన తర్వాత కొన్ని భావాలు మనసులోకి చొరబడతాయి. క్రమంగా వివిధ భావాలమధ్య సమన్వయం ఏర్పడి స్వతంత్ర ఆలోచనా శక్తి, సృజనాత్మకత వృద్ధి చెందుతుంది. అంటే మనసులోకి ప్రవేశించిన భావాలు, ఆలోచనల మథనం నుండే సృజనాత్మకత పుడుతుందన్నమాట!
దీనిని బట్టి మనిషి అంతరంగంలోకి ప్రవేశపెట్టుకున్న భావాలు, ఆలోచనలే అతని భవిష్యత్ ఆలోచనకు, వ్యక్తిత్వానికి పునాదిరాళ్ళని తెలుస్తోంది. కాబట్టి ఆలోచనాస్రవంతిలోకి భావాలు ప్రవేశపెట్టేటప్పుడే జాగ్రత్త వహించాలి. అపసవ్య ఆలోచనాలనే వైరస్‌లను బ్రెయిన్ అనే కంప్యూటర్‌లోకి చొప్పిస్తే మొత్తం ప్రోగ్రామ్ అంతా చెడిపోతుంది.
కడివెడు పాలను విరచడానికి ఒకే ఒక్క విషబిందువు చాలు! ఏదైనా ఒక లక్ష్యం కోసం కృషిని ప్రారంభించే ముందు నాణేనికి రెండువైపులా చూడాలి. కానీ తమపై తమకు నమ్మకంలేనివారు కేవలం ఒకవైపు మాత్రమే చూస్తూ అపసవ్య ఆలోచనలు పెంపొందించుకొంటుంటారు. విజయాన్ని వాయిదా వేసే అపసవ్య ఆలోచనలను వదిలించుకోవడం కాస్త కష్టసాధ్యమే!
ఎనభైశాతం విజయం సాధించి ఇరవై శాతం అపజయం ఎదుర్కొన్నా ఆ అపజయమే మన వైఫల్యాన్ని ఎత్తిచూపి విజయాన్ని అపహాస్యం చేస్తుంది. విజయానికి చేరువలో ఉన్నామనే విషయాన్ని విస్మరించి అవాంతరానే్న తలచుకొని మదనపడతాం!
నిజమే! అపసవ్య ఆలోచనలకున్న బలం అలాంటిది. ఇవి హద్దులు మీరితే ఏ విషయాన్ని సహేతుకంగా చూడనీయవు. తలపై అనవసర భారాన్ని మోపి అంతర్గత శక్తిని వృధా చేస్తాయి. సాధారణంగా అపసవ్య ఆలోచనలన్నీ గతానికో, భవిష్యత్తుకో సంబంధించినవై ఉంటాయి. కాబట్టి వీటివల్ల వర్తమానం వృధా అవుతుంది.

  • కంసుడు
0Shares
]]>
https://sevalive.com/2024/08/07/%e0%b0%86%e0%b0%b2%e0%b1%8b%e0%b0%9a%e0%b0%a8%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%8e%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b2%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf-2/feed/ 0 108
పదవుల పంపకాలపై చంద్రబాబు కొత్త ఫార్ములా https://sevalive.com/2024/08/05/%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/ https://sevalive.com/2024/08/05/%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/#respond Mon, 05 Aug 2024 10:44:23 +0000 https://sevalive.com/?p=82 ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం మూడు పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పార్టీల నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా.. ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. రేపోమాపో అంటూ సాగదీయటంతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో, నామినేటెడ్ పదవుల భర్తీ పైన చంద్రబాబు, పవన్ ఒక ఫార్ములా సిద్దం చేసారు. పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశం పై నిర్ణయానికి వచ్చారు.

ఆశావాహుల నిరీక్షణ టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ నేతలు నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ కార్యక్రమంలో నామినేటెడ్‌ ఆశావహుల దరఖాస్తులే ఎక్కువగా ఉంటున్నాయనే చర్చ టిడిపిలో జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరుతో ఈ గ్రీవెన్స్‌ కార్యక్రమం మొదలుపెట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు ఎంతమంది వస్తున్నారో అంతే సంఖ్యలో పదవుల కోసమూ వస్తున్నారు.
చంద్రబాబు కసరత్తు నామినేటెడ్‌ పోస్టుల కోసం చూస్తున్న ఆశావహులు తమ బయోడేటాను పార్టీ కార్యాలయంలోని ప్రోగ్రామ్స్‌ కమిటీకి అందించాలని టిడిపి అధిష్టానం నెలన్నర క్రితం ఆ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రోగ్రామ్స్‌ కమిటీ నాయకుల నుంచి బయోడేటా, దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రోగ్రామ్స్‌ కమిటీకి వచ్చిన బయోడేటాల పరిశీలన కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. టిడిపిలో సీనియర్‌ నేతలు సైతం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులను ఆశిస్తున్నారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టికెట్లు త్యాగం చేసిన నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కోసం సీటు త్యాగం చేసిన నేతలు ఈ విభాగంలో ఉన్నారు.

పంపకాల ఫార్ములా టిడిపి కూటమిలో నామినేటెడ్‌ పదవుల పంపకాలకు ఒక ఫార్ములా సిద్దం చేసారు. టిడిపి గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున పదవులు పంపకాలు చేయాలని మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో జనసేనకు 60 శాతం, టిడిపికి 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున, బిజెపి గెలిచిన నియోజకవర్గాల్లో బిజెపికి 60 శాతం, టిడిపికి 30 శాతం, జనసేనకు 10 శాతం పంపకాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో, పదవుల భర్తీ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది.

0Shares
]]>
https://sevalive.com/2024/08/05/%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/feed/ 0 82