ప్రజాసేవ – సేవ https://sevalive.com SEVA LIVE Mon, 05 Aug 2024 11:20:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7 31484547 పదవుల పంపకాలపై చంద్రబాబు కొత్త ఫార్ములా https://sevalive.com/2024/08/05/%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/ https://sevalive.com/2024/08/05/%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/#respond Mon, 05 Aug 2024 10:44:23 +0000 https://sevalive.com/?p=82 ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం మూడు పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పార్టీల నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా.. ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. రేపోమాపో అంటూ సాగదీయటంతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో, నామినేటెడ్ పదవుల భర్తీ పైన చంద్రబాబు, పవన్ ఒక ఫార్ములా సిద్దం చేసారు. పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశం పై నిర్ణయానికి వచ్చారు.

ఆశావాహుల నిరీక్షణ టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ నేతలు నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ కార్యక్రమంలో నామినేటెడ్‌ ఆశావహుల దరఖాస్తులే ఎక్కువగా ఉంటున్నాయనే చర్చ టిడిపిలో జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరుతో ఈ గ్రీవెన్స్‌ కార్యక్రమం మొదలుపెట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు ఎంతమంది వస్తున్నారో అంతే సంఖ్యలో పదవుల కోసమూ వస్తున్నారు.
చంద్రబాబు కసరత్తు నామినేటెడ్‌ పోస్టుల కోసం చూస్తున్న ఆశావహులు తమ బయోడేటాను పార్టీ కార్యాలయంలోని ప్రోగ్రామ్స్‌ కమిటీకి అందించాలని టిడిపి అధిష్టానం నెలన్నర క్రితం ఆ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రోగ్రామ్స్‌ కమిటీ నాయకుల నుంచి బయోడేటా, దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రోగ్రామ్స్‌ కమిటీకి వచ్చిన బయోడేటాల పరిశీలన కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. టిడిపిలో సీనియర్‌ నేతలు సైతం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులను ఆశిస్తున్నారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టికెట్లు త్యాగం చేసిన నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కోసం సీటు త్యాగం చేసిన నేతలు ఈ విభాగంలో ఉన్నారు.

పంపకాల ఫార్ములా టిడిపి కూటమిలో నామినేటెడ్‌ పదవుల పంపకాలకు ఒక ఫార్ములా సిద్దం చేసారు. టిడిపి గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున పదవులు పంపకాలు చేయాలని మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో జనసేనకు 60 శాతం, టిడిపికి 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున, బిజెపి గెలిచిన నియోజకవర్గాల్లో బిజెపికి 60 శాతం, టిడిపికి 30 శాతం, జనసేనకు 10 శాతం పంపకాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో, పదవుల భర్తీ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది.

0Shares
]]>
https://sevalive.com/2024/08/05/%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/feed/ 0 82
మోదీ – చంద్రబాబు పనితీరుతో మనకు మంచి రోజులు వచ్చాయ్ https://sevalive.com/2024/08/05/%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6%e0%b1%80-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%aa%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4/ https://sevalive.com/2024/08/05/%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6%e0%b1%80-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%aa%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4/#respond Mon, 05 Aug 2024 10:40:29 +0000 https://sevalive.com/?p=79 చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని, ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా సిద్దంగా ఉన్నారని, ఇక ముందు మన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్. అమరనాథ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ సీఎం ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఆయనతో పలు విషయాలప చర్చలు జరిపారు. అనంతపరం మీడియతో మాట్లాడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలపై విరిచుకుపడ్డారు. గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరీ పీల్చుకుని సంతోషంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని బావిస్తున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

త వైసీపీ పాలనలో ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులను ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని, రెండు నెలల నుంచి ప్రజలకు స్వేచ్చ వచ్చినట్లు అయ్యిందని, రాక్షస పాలనకు ప్రజలు చెక్ పెట్టారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పెద్దాయన అని చెప్పుకునే ఓ మాజీ మంత్రి బాధితులు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారని పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు విడుదల చెయ్యడానికి వేగంగా పనులు మొదలైనాయని, అలాగే దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అయిన పోలవం ప్రాజెక్టు పనులు పూర్తి చెయ్యడానికి పూర్తిగా సహకరిస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు మొదలైనాయని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని, కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదే సందర్బంలో మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే ఎన్. అమరనథ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇదే సందర్బంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు.

0Shares
]]>
https://sevalive.com/2024/08/05/%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6%e0%b1%80-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%aa%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4/feed/ 0 79