ఆంధ్రప్రదేశ్ – సేవ https://sevalive.com SEVA LIVE Fri, 09 Aug 2024 07:44:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 31484547 డొక్కా సీతమ్మ పేరు పవన్ కళ్యాణ్ సూచించారు. https://sevalive.com/2024/08/09/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95/ https://sevalive.com/2024/08/09/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95/#respond Fri, 09 Aug 2024 07:44:04 +0000 https://sevalive.com/?p=160 డొక్కా సీతమ్మ .. ఈ పేరు ఏపీలో చాలా మందికి తెలియని పేరు. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆ అపర అన్నపూర్ణ పేరు అందరికీ చిర పరిచయం అయ్యింది. అయితే డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్ లు పెట్టాలని మొదట పవన్ కళ్యాణ్ భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో కూడా చర్చించినట్టు సమాచారం.


ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ లు ఆగస్ట్ 15 నుండి ప్రారంభం అయితే తాజాగా ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రారంభించే కాంటీన్లకు పేరు ఖరారు విషయంలో ఒక ఆసక్తికర చర్చ చోటు చేసుకొంది. వీటికి ఎన్టీఆర్ పేరుతో అన్నా కాంటీన్లు అని కొనసాగించాలా, డొక్కా సీతమ్మ గారి పేరు కూడా జోడించాలా అనే చర్చ వచ్చింది. ఈ సందర్భంగా 2019 వరకూ ఉన్న విధంగా అన్నా కాంటీన్లు అని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.


డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో కాంటీన్లకు ఎన్టీఆర్ పేరును కొనసాగించవచ్చని ప్రతిపాదన పవన్ కళ్యాణ్ చేశారు .డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తే ప్రతి విద్యార్థికి సీతమ్మ గొప్పదనం తెలుస్తుందని, పాఠశాల స్థాయిలో విశిష్ట వ్యక్తులు, దాతృత్వం కలిగినవారి పేర్లు మీద పథకాలు ఉండటం వల్ల భావితరాలకు మేలు కలుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
స్కూల్ లో డొక్కా సీతమ్మ గురించి చదివిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తాను పాఠశాల దశలో ఉండగా డొక్కా సీతమ్మ గురించి చదివిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కంబాల కృష్ణమూర్తి రాసిన అమృత వాక్కులు అనే సంకలనాన్ని మా నాన్నగారు తనకు ఇచ్చారని, అందులో డొక్కా సీతమ్మ దాన గుణాన్ని, ఆకలి అన్న వారికి అర్థరాత్రి వేళ కూడా వండివార్చి పెట్టేవారనీ చదివానన్నారు.

అందరి ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అంతర్వేది దర్శనానికి బయలుదేరితే… దారిలో తన ఇంటికి భోజనానికి యాత్రికులు వస్తున్నారని తెలిసి దైవ దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చి ఆకలి తీర్చారని చదివాను. ఆ రోజు నుంచి డొక్కా సీతమ్మ గారి దాతృత్వ భావనలు గుర్తుకు వస్తూనే ఉంటాయని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాలన్న ప్రతిపాదన స్కూలు విద్యార్థులకు భోజనం అందించే పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఉండటం వల్ల భావి తరాలకు విలువలు అందించగలమన్నారు. అలాగే పేదలకు కిలో రూ.2 కు బియ్యం అందించే పథకం తీసుకువచ్చిన ఎన్టీఆర్ గారి పేరుతో అన్నా కాంటీన్లు నిర్వహణ సముచితమన్నారు. అందుకే డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాలని చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పెట్టారు.

0Shares
]]>
https://sevalive.com/2024/08/09/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95/feed/ 0 160
కీలక పదవుల నియామకం https://sevalive.com/2024/08/07/%e0%b0%95%e0%b1%80%e0%b0%b2%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b0%95%e0%b0%82/ https://sevalive.com/2024/08/07/%e0%b0%95%e0%b1%80%e0%b0%b2%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b0%95%e0%b0%82/#respond Wed, 07 Aug 2024 07:28:43 +0000 https://sevalive.com/?p=119 ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెండింగ్ పదవుల నియామకం పైన కసరత్తు చేస్తోంది. టీటీడీ తో సహా అన్ని కీలక పదవుల పైన చంద్రబాబు - పవన్ చర్చలు చేసారు. ప్రాధమికంగా కొన్ని పదవుల పైన నిర్ణయానికి వచ్చారు. టీటీడీ ఛైర్మన్ గా మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడు పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అదే విధంగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తో పాటుగా చీఫ్ విప్...జనసేన, బీజేపీ విప్ ల నియామకం పైన తుది నిర్ణయం తీసుకున్నారు.

డిప్యూటీ స్పీకర్ గా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను ఖరారు చేసినట్లు సమాచారం. స్పీకర్ గా ఉత్తరాంధ్రకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉండటంతో…డిప్యూటీ స్పీకర్ గా రాయల సీమ ప్రాంతానికి చెందిన బీసీ నేత కాల్వ శ్రీనివాసుల వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, సవిత స్థానం దక్కించుకున్నారు. దీంతో, సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

చీఫ్ విప్ గా జీవీ

అసెంబ్లీలో కూటమికి 164 సభ్యుల సంఖ్యా బలం ఉంది. అదే విధంగా టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో చీఫ్ విప్ పదవి ఆ పార్టీకే దక్కనుంది. ఈ పదవి తొలి నుంచి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఇస్తారనే ప్రచారం సాగింది. అయితే, పల్నాడు జిల్లా నుంచి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆ ప్రాంతానికి చెందిన వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను చీఫ్ విప్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే విధంగా మూడు పార్టీల నుంచి 14 మంది విప్ లను నియమించనున్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల నుంచి
జనసేన నుంచి ఇప్పటికే నలుగురి పేర్లను పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు సిఫార్సు చేసారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్, జనసేన చీఫ్ విప్ గా లోకం మాధవిని నియమించనున్నారు. అదే విధంగా జనసేన నుంచి మరో ఇద్దరు విప్ లుగా నియమితులు కానున్నారు. బీజేపీ నుంచి చీఫ్ విప్ గా సుజనా చౌదరి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఫ్లోర్ లీడర్ గా విష్ణు కుమార్ రాజు నియమితులయ్యారు. అదే విధంగా టీటీడీ బోర్డుతో పాటుగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల పైన ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

0Shares
]]>
https://sevalive.com/2024/08/07/%e0%b0%95%e0%b1%80%e0%b0%b2%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b0%95%e0%b0%82/feed/ 0 119
డొక్కా సీతమ్మ https://sevalive.com/2024/08/06/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/ https://sevalive.com/2024/08/06/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/#respond Tue, 06 Aug 2024 10:28:47 +0000 https://sevalive.com/?p=104 డొక్కా సీతమ్మ

ఆంధ్రదేశంలో కొంత కాలం క్రితం వరకు డొక్కా సీతమ్మగారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె అన్నదానం ఖ్యాతి ఖండ ఖండాంతరాల్లో నూ వ్యాపించింది. ఆమె గురించి ఈ కాలం వారికి పెద్దగా తెలిసి ఉండకపో వచ్చు ఇప్పుడు ఆమెను గురించి కాంచెం తెలుసుకుందాం..

డొక్కా సీతమ్మగారు తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరంలో 1841 లో జన్మించింది. ఆమె తండ్రి అనప్పిండి
భవానీ శంకరుడు… తల్లి నరసమ్మ. వీరి వంశం వారు ఇప్పటికీ లంకలగన్నవరంలో ఉన్నారు.

సీతమ్మ బాల్యం నుంచి వితరణ స్వభావం కలది. పుట్టినింటి వారు అంత సంపన్నులు కారు. సీతమ్మగారు ఉన్నంత లోనే పేదసాదలకు అన్నం పెట్టేది సాయం చేసేది. ఆమెభర్త డొక్కా జోగన్నగారు. అత్తింటివారు సంపన్నులు కావటంతో సీతమ్మగారు భర్త అనుమతితో దానధర్మాలు చేస్తూ ఉండేది. అన్నదానం చేయడంలో ఈమెకు ఎక్కువ ప్రీతి. గొప్ప, బీద,జాతి, మత, కుల భేదాలు లేకుంగా ఏ వేళకు వచ్చి అన్నం అడిగినా లేదన కుండా, విసుక్కోకుండా వాళ్ళని ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తి పరచేది. ఈ విషయంలో భర్త కూడా అమెకు అన్ని విధాలా సాయపడుతూ ఉండేవాడు. .

సీతమ్మగారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు, గాథలు ఆంధ్రదేశంతో ప్రచారంలో ఉన్నాయి. సంతానం లేని ఒక జిల్లా కలెక్టరు సీతమ్మ గారి చేతి చలువ అన్నం వల్లనే తనకు సంతానం కలిగిందని విశ్వసించేవాడు, ‘ధాత’ కరువు వచ్చినప్పుడు ఈ దంపతులు చేసిన అన్నదానం గురించి చాటు కవులు ఎన్నో విధాల ప్రసంసించారు.

ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి బాగా ముసురు పట్టి వర్షం కురుస్తోంది. దానికి తోడు గోదావం పొంగి ప్రవహిస్తోంది. ఒక హరిజనుడు గోదావరి లంకలో చిక్కుకు ని, ఆకలితో అలమటిస్తూ గొంతెత్తి ‘అమ్మా, సీతమ్మ తల్లి ఆకలి తో ప్రాణం పోతోందమ్మా – అన్నం పెట్టి పుణ్యం కట్టుకోమ్మా’ అని ఆక్రోశిస్తున్నాడట. ఎలాగో ఆ ఆక్రోశం సీతమ్మగారి చెవుల పడింది. వెంటనే ఆమె బయలుదేరింది. ఆ వర్షంలో ఆ గోదావరిలో అన్నం కుండ నెత్తి మీద పెట్టుకుని భర్త సాయంతో ఆ లంక లోకి వెళ్ళి, ఆ హరిజనుడికి అన్నం పెట్టి, ఆకలి తీర్చి, అతడిని వెంటపెట్టుకు ని గోదావరి దాటించి తన ఇంటికి తీసుకు వచ్చి కాపాడింది.

ఒకసారి ఒక దొంగ సీతమ్మ గారి ఇంటికి వచ్చి ఆమె పట్టు చీర దొంగిలించాడు. చుట్టు పక్కల వారు కనిపెట్టి, దొంగని పట్టుకుని కట్టేసి కొట్టబోయారు. సీతమ్మ గారు వారిని వారించి ఆ దొంగని కట్లు విప్పించి, వాడికి అన్నం పెట్టి ఆ పట్టు చీర తానే స్వయంగా ఆ దొంగకి ఇచ్చి పంపించిందట.

మరోసారి సీతమ్మగారు అంతర్వేది తీర్థానికి మేనాలో బయలుదేరింది. దారి లో పెళ్ళివారి గుంపు ఒకటి ఎదురైంది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ
‘సీతమ్మగారు ఊళ్ళో లేదు. అమే వుంటే మనల్ని ఇలా అభోజనంగా పంపించేదా’ అనుకుంటున్నారుట. సీతమ్మగారు అ మాటలు విని, మేనా దిగి వారి సంగతి కనుక్కుని, తాను వెనక్క తిరిగి ఆ పెళ్ళి వారిని వెంటపెట్టుకుని ఇల్లు చేరి అప్పటి కప్పుడు అంతమందికీ వంట చేసి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది.

సీతమ్మగారి అన్నదాన వ్రతనిష్ఠును పరీక్షించడానికి ఒకరోజు రాత్రి పిఠాపురం రాజా గంగాధరరావుగారు, తమ దివాను తో కూడా మారు వేషాలతో వెళ్ళి సీతమ్మ గారి ఇంటి వీధి అరుగు మీద పడుకున్నా రుట – రాత్రి తలుపులు వేసుకోవడానికి వచ్చిన సీతమ్మగారు అరుగుల మీద కొత్త వారిని చూని లోపలికి వచ్చి భొజనం చేసి పడుకోండి’ అన్నది. వారిద్దరు తమకు ఆరోగ్యం బాగాలేదని అన్నారుట. ఫరవా లేదు, మికు పథ్యంగానే వండిపెడతానని వాళ్ళని లోపలికి తీసుకువచ్చి ఆ రాత్రి వేళ పథ్యం వంట చేసి పెట్టిందిట సీతమ్మగారు.

సీతమ్మగారి అన్నదాన ప్రశస్తి అనాటి బ్రిటిషు చక్రవర్తి ఏడో ఎడ్వర్డ్ గారికి తెలిసింది. ఆయన ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ యోగ్యతా పత్రాన్ని పంపించా రుట. అంతేకాకుండా ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం లండన్ లో జరిగే చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లో దర్బారు హాల్లో సీతమ్మ గారి ఫొటో పెట్టేందుకు ఆదేశించారుట.

అలా ఆ ఫోటో కోసం ఒకే ఒక్కసారి కెమెరా ముందు కుర్చీలో కూర్చుని ఫోటో దిగారు సీతమ్మగారు.

సీతమ్మగారి వలె ఆదరించి అన్నం పెట్టే తల్లుల మూలంగానే ఆంధ్రదేశం అన్నపూర్ణ అయింది.

0Shares
]]>
https://sevalive.com/2024/08/06/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/feed/ 0 104
పదవుల పంపకాలపై చంద్రబాబు కొత్త ఫార్ములా https://sevalive.com/2024/08/05/%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/ https://sevalive.com/2024/08/05/%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/#respond Mon, 05 Aug 2024 10:44:23 +0000 https://sevalive.com/?p=82 ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం మూడు పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పార్టీల నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా.. ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. రేపోమాపో అంటూ సాగదీయటంతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో, నామినేటెడ్ పదవుల భర్తీ పైన చంద్రబాబు, పవన్ ఒక ఫార్ములా సిద్దం చేసారు. పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశం పై నిర్ణయానికి వచ్చారు.

ఆశావాహుల నిరీక్షణ టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ నేతలు నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ కార్యక్రమంలో నామినేటెడ్‌ ఆశావహుల దరఖాస్తులే ఎక్కువగా ఉంటున్నాయనే చర్చ టిడిపిలో జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరుతో ఈ గ్రీవెన్స్‌ కార్యక్రమం మొదలుపెట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు ఎంతమంది వస్తున్నారో అంతే సంఖ్యలో పదవుల కోసమూ వస్తున్నారు.
చంద్రబాబు కసరత్తు నామినేటెడ్‌ పోస్టుల కోసం చూస్తున్న ఆశావహులు తమ బయోడేటాను పార్టీ కార్యాలయంలోని ప్రోగ్రామ్స్‌ కమిటీకి అందించాలని టిడిపి అధిష్టానం నెలన్నర క్రితం ఆ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రోగ్రామ్స్‌ కమిటీ నాయకుల నుంచి బయోడేటా, దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రోగ్రామ్స్‌ కమిటీకి వచ్చిన బయోడేటాల పరిశీలన కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. టిడిపిలో సీనియర్‌ నేతలు సైతం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులను ఆశిస్తున్నారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టికెట్లు త్యాగం చేసిన నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కోసం సీటు త్యాగం చేసిన నేతలు ఈ విభాగంలో ఉన్నారు.

పంపకాల ఫార్ములా టిడిపి కూటమిలో నామినేటెడ్‌ పదవుల పంపకాలకు ఒక ఫార్ములా సిద్దం చేసారు. టిడిపి గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున పదవులు పంపకాలు చేయాలని మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో జనసేనకు 60 శాతం, టిడిపికి 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున, బిజెపి గెలిచిన నియోజకవర్గాల్లో బిజెపికి 60 శాతం, టిడిపికి 30 శాతం, జనసేనకు 10 శాతం పంపకాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో, పదవుల భర్తీ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది.

0Shares
]]>
https://sevalive.com/2024/08/05/%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/feed/ 0 82
మోదీ – చంద్రబాబు పనితీరుతో మనకు మంచి రోజులు వచ్చాయ్ https://sevalive.com/2024/08/05/%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6%e0%b1%80-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%aa%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4/ https://sevalive.com/2024/08/05/%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6%e0%b1%80-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%aa%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4/#respond Mon, 05 Aug 2024 10:40:29 +0000 https://sevalive.com/?p=79 చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని, ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా సిద్దంగా ఉన్నారని, ఇక ముందు మన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్. అమరనాథ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ సీఎం ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఆయనతో పలు విషయాలప చర్చలు జరిపారు. అనంతపరం మీడియతో మాట్లాడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలపై విరిచుకుపడ్డారు. గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరీ పీల్చుకుని సంతోషంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని బావిస్తున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

త వైసీపీ పాలనలో ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులను ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని, రెండు నెలల నుంచి ప్రజలకు స్వేచ్చ వచ్చినట్లు అయ్యిందని, రాక్షస పాలనకు ప్రజలు చెక్ పెట్టారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పెద్దాయన అని చెప్పుకునే ఓ మాజీ మంత్రి బాధితులు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారని పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు విడుదల చెయ్యడానికి వేగంగా పనులు మొదలైనాయని, అలాగే దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అయిన పోలవం ప్రాజెక్టు పనులు పూర్తి చెయ్యడానికి పూర్తిగా సహకరిస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు మొదలైనాయని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని, కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదే సందర్బంలో మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే ఎన్. అమరనథ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇదే సందర్బంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు.

0Shares
]]>
https://sevalive.com/2024/08/05/%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6%e0%b1%80-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%aa%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4/feed/ 0 79