నమస్తే!
తెలుగు వార్తా ప్రపంచంలో ఎన్నో పత్రికలు, ఎన్నో చానల్స్, ఎన్నో వెబ్ సైట్స్, కేబుల్ నెట్ వర్క్స్, ప్రసార, ప్రచార సాధనాలున్నాయి. అయితే యివన్నీ ఒక్కో రంగానికి సంబంధించి ఒక్కొక్కటి ఎంచుకొని, అందుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఐతే ఈ సేవ కు అన్ని రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సకల సేవలు అందించాలన్నదే లక్ష్యం. ప్రధానంగా ” సేవ “లో రాజకీయ, విద్య, వైద్య, విజ్ఞాన, వాణిజ్య, ఆధ్యాత్మిక, క్రీడా, సాహిత్య, సాంస్కృతిక, కళా, సినీ రంగాలకు సంబంధించి వివిధ సేవలు అందించాలనుకున్నాం.
అలాగే బాల్య, యువ, కార్మిక, కర్షక, మహిళలకు, పెద్దలకు, అంతల్జాలవీక్షకులకు అవసరమయ్యే సమాచారం, ఇత్యాది సేవలను అందించాలను కున్నాము. ఆ బాటలోనే ‘ సేవ’ పయినిస్తుంది.
మా కలం ప్రజా గళం. ఏ పార్టీకి దగ్గర కాదు. అలాగని దూరమూ కాదు. ఒక వర్గానికో.. ఒకగ్రూపుకో కొమ్ము కాయదు. ఇది ప్రస్తుతానికి ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే సేవను ముందుకు తీసుకువస్తున్నాం.. వీటన్నిటినీ అధికమించి.. ‘సేవ’ ను ఇప్పుడు ఆన్ లైన్ చేసాం. తెలుగుకు ప్రాధాన్యతనిస్తూ .. సమగ్ర సమాచారంతో… పాత్రికేయులను, రచయిత (త్రు)లను, పలువురు మేధావులను కలుపుకొని వివిధ శీర్షికలతో.. సకల వార్తా స్రవంతిని మీ ముందుంచాలన్నదే మా ( మీ) సేవ ప్రధాన లక్ష్యం..
మా అక్షరం.. మీ కోసం.. మన తెలుగు వారి కోసం.. అందుకే మా (మీ) సేవ కోరుకుంటుంది అందరి సహాయ సహకారాలు..
మా (మీ) సేవ లైవ్ లోను మీకు ఎలాంటి సేవలుండాలో చెపితే వాటిని అందించడానికి కృషిచేస్తాం. మార్పులు ఏమేమి చేయాలి, ఎలాంటివి వుండాలి… మీరు ఈ సేవ లో ఏమి కోరుకుంటున్నారో తెలియజేయండి. మంచి ఆలోచనకు “సేవ” ఎల్ల వేళలా శ్రీకారం చుడుతూనే వుంటుంది.
మీ అమూల్య అభిప్రాయాలే ‘ సేవ ‘ కు స్వాతి ముత్యాలు …. మీ అమూల్య కానుకలు.


ఆదరించండి… ఆశీర్వదించండి…
మీ ఆదరాభిమానాలను కోరుకొంటూ….

సదా సేవలో…

సేవ
తెలుగు పత్రిక.
email: admn.seva@gmail.com
Phone: 8333966660

0Shares