మంత్రవాది నానీలు

కులం కలం
పదునెక్కిందట
ఎన్ని మెదళ్ళను
మేల్కొల్పుతుందో? 1
వెండితెరపై
వెలిసి పోయిన బొమ్మలు
బుల్లితెరపై
కొత్తరంగులతో 2
చెత్తబుట్టలు
తల్లిదండ్రులు
యువతలో రేగిన
కొత్త ఆలోచన 3
ఆంగ్ల విద్య
అవసరం లేదు
దాన్ని పూర్తిగా
తొలగిస్తే సరి 4
రాక్షసత్వం
మనిషి నైజమట!
కలిపై వంక
పలాయన వాదం 5
అందరికీ న్యాయం
అంతు చిక్కడంలేదు
ఎవరికీ?
ప్రశ్నార్థకమే? 6
మూడు స్పెషల్
ఆరు బెనిఫిట్ షోలు
చలన చిత్ర
వ్యాపార చిత్రాలు 7
డా. మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ,
గుంటూరు