టీటీడీ ఛైర్మన్ గా బి. ఆర్. నాయుడు?

     ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు  ఛైర్మన్ ఎంపిక పై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తుంది.  కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవుల పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి కోసం పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. ఛైర్మన్ పదవితో పాటుగా బోర్డు సభ్యులుగా పలువరు ప్రయత్నాలు చేసారు. అయితే, మీడియా సంస్థ    టీవీ 5  అధినేత  బి. ఆర్. నాయుడును  టీటీడీ  బోర్డు ఛైర్మన్ గా ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

  రెండు నెలల కాలంగా టీటీడీ ఛైర్మన్ పదవి ఎంపిక పైక కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల కూటమి అధికారంలోకి రావటంతో పలువురు ప్రముఖులు ఈ పోస్టు కోసం పోటీ పడ్డారు. సామాజిక సమీకరణాలు. అనుభవం పరిగణలోకి తీసుకొని చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పైన చర్చ జరిగింది. అయితే, ఆ తరువాత ఆయనకు అవకాశం లేదని తేల్చారు.
తాజాగా టీవీ 5 సంస్థల అధినేత బీఆర్ నాయుడును టీటీడీ ఛైర్మన్ గా  చంద్రబాబు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.  సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు. టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేస్తున్న మరో సీనియర్ నేత పేరు పైన చర్చ జరిగింది. ఇటీవల జేఈవో వెంకయ్య చౌదరిని నియమించిన సందర్భంలో కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినట్లు విమర్శలు వచ్చిన నేపథ్యంలో   బి. ఆర్. నాయుడుకు ఇవ్వడంలో చంద్రబాబు ఆలోచనలో పడ్డారని తెలిసింది.   
     అయితే, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాటి ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా  టీడీపీకి మద్దతుగా నిలిచిన  మీడియా సంస్థ  అధినేత బి. ఆర్. నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. 

టీటీడీ నూతన పాలకవర్గం అదే విధంగా టీటీడీ పాలక మండలి నియామకం పైన కసరత్తు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు పార్టీల నేతలకు ఇందులో భాగస్వాములను చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది సభ్యులను నియమించనన్నారు. ఇందులో బీజేపీకి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. జనసేన నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి నలుగురికి అవకాశం దక్కనుంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటుగా ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖుడి పేరు బోర్డు సభ్యుల జాబితాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించనునున్నట్లు సమాచారం.

0Shares