ఉగాది పచ్చడి

  • నడిపల్లి సుబ్బలక్ష్మి

వసంత ఋతు హాసంతో ఏతెంచె “ విశ్వావసు”
స్నేహ సౌరభాలు వెదజల్లె మలయ మారుత వీచికలు.
లేత మావి పిందెలందించె స్వాగత వచనాలు, వగరుతో కూడిన పులుపును…
నవ జీవన ప్రభాతాలు నును వెచ్చని అరుణ కిరణాలు.
కమలాకర ప్రభాకరుడు యేతెంచె కరుణతో.
సకల జనావళికందించె
సర్వ సౌఖ్యాలు.
షడ్రుచులు అందించె నవ నవర్షానికి ఆనందమయ వసంత శోభ.
తీయనిపాటలతో ఆమని తలుపులు తీసెను, క్రొత్త బెల్లపు తీపినందిస్తూ…
గున్న మావి పైని మధు మాస కోయిలలు.
నింబ కుసుమించె కోకిల కూజంతములతో చిరు చేదు రుచిని…
షడ్రుచులందించె ఉగాది పచ్చడిలో…
జీవితాన షడ్రుచులరూపాన కష్ట సుఖాల అనుభవాల నందించు…
నింగి శోభించె శాంతి శంఖ నినాదాలతో.
వెదజల్లె పంచాంగ శ్రవణాలు ఆశా కిరణాలు.
పలుకుదాం స్వాగతం విశ్వావసుకు…
సేవిద్దాం షడ్రుచుల యుగాది పచ్చడిని.
కొలుద్దాం కోదండ పాణిని కరుణా మూర్తిని.

  • నడిపల్లి సుబ్బలక్ష్మి
0Shares