సౌభ్రాతృత్వం

  • జె వి కుమార్ చేపూరి

బుద్ది, జ్ఞానం యెరుగనిదే జంతులోకం
ఐనా మమతలో తానే మకుటాయమానం
చేరదీసి, పక్క జాతులను ఈ మర్కటం
సౌభ్రాతృత్వానికి చెబుతున్నది కొత్త అర్ధం
మూడు జాతుల మధ్యనున్నా జాతి వైరం
శునక భుజం పైన చేయి వేసి మర్కటం
చాటుతున్నది ఎల్లలు లేని స్నేహ భావం
పిల్లికూనకు, తన ఒడిలో ఇచ్చి స్థానం
మార్జాల శునక మైత్రికి, వేసింది బీజం
సర్వ జీవ సౌభ్రాతృత్వానికి చుట్టి శ్రీకారం
నేర్పుతున్నది, నరునికి గొప్ప గుణపాఠం

చదువు, సంస్కారం నేర్చుకొని నరలోకం
పెంచుకుంటున్నది స్వార్ధం, మలినభావం
సాటి మనుషులతోనే సరిపడని వ్యవహారం
ఇరుగుపొరుగుతోనూ ఎడముఖం,పెడముఖం
తోడబుట్టిన వారి పైనే, కత్తులు దూసే వైనం
దిగజారుతున్న మానవ విలువలకు దర్పణం

ఈ మూడు జాతుల మధ్య కుదిరిన స్నేహం
తెరిపించాలి, నరుని మూసుకుపోయిన నేత్రం
పరిఢవిల్లాలి, సర్వ మానవ సౌభ్రాతృత్వం

  • జె వి కుమార్ చేపూరి
    హైదరాబాద్
0Shares