సోదరభావం

  • డా. కమలాదేవి

స్నేహం, ప్రేమ , అభిమానం కేవలం మానవుల సొత్తేకాదు
నోరు వాయిలేని జంతువులలోను
ఉంటుంది
జాతివైరాన్నికూడా దూరంపెట్టి
అక్కున చేర్చుకుంది
కుక్క పిల్లులను
మర్కటం
పంచిపెట్టింది
భుజం మీద చేయివేసి
స్నేహ పరిమళాన్ని
ఆమర్కటం
కానవస్తోంది
మానవులలో కానరాని
సౌహార్ద్రత ఈ మర్కటంలో
నిలుస్తోంది ఈ మాట్లాడలేని
ఈవానరం నిలిచింది
ఆదర్శంగ
నోరు మేధస్సు జ్ఞానం
ఉన్న మానవులకు
నేర్చుకోవలసింది
ఎంతో ఉంది మనకు
ఈమూగజీవులనుండి
దయ, కరుణ, ప్రేమ
వాత్సల్యం,స్నేహశీలత
సోదరభావన
ఇత్యాదులు అందరు
అనుసరించవలసిందే.

  • – డా. భమిడిమల్లి కమలాదేవి
0Shares