స్నేహం .
- ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి.

స్నేహం చేయగా జాతుల భేదమేలా
మమతతో మది నిండితే వాదమేలా
సయోధ్య కుదిరితే వర్ణాలు జాతి యేలా
సఖ్యతగా ఉంటే కోపాలు గొడవలేలా
సామరస్యమే సగం బలం నిజముగ సత్యా .
ఒకరికొకరు తోడై ఉన్నారు దండుగా
కలసి ఉంటే ఉంటుంది నిర్భయం మిన్నగా
స్నేహభావంలో మనస్సు కలిస్తే మది వెన్నేగా
ముంచుకొచ్చే ఆపదను జయించవచ్చు ఘనంగా
కలసి ఉంటే సగం బలం నిజముగా సత్యా.
జ్ఞానం లేదు అనుకోవడమే మన అజ్ఞానం
మనకన్నా మిన్నగ చూపుతున్నాయి జ్ఞానం
ఆ ప్రేమే వాటికి కిరీటం మకుటాయమానం
మూడు జాతులు కలిసివున్న సమతే జ్ఞానం
మలినంలేని సాగత్యం మధురం సత్యా.
మనిషిలో వెతకాలి కలిసివుండే తత్వం .
పెరిగేకొంత ఒకరిపైఒకరకు అసూయతత్వం
మరిచిపోయి మంచితనం మానవత్వం
పిల్లి, మార్జాలం,శునకం నేర్పుతుండే వ్యక్తిత్వం
గ్రహించాలి ప్రతి జీవిలో ఉండే మంచి లక్షణం సత్యా .
- ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి