సేద దీర్చు వృక్షం నేస్తం.

  • డా. కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి

కలతలు కమ్ముకుని ఉసురు ముసుర్లు ఉరులై ||
గుబులు గుండెల నిండి కన్న కలలు కన్నీరై కరిగి ఆవిరైన వేళ ||
ఆదుకునే ఆపన్న హస్తం, కష్టంలో కాచుకునే దైవం నేస్తం, ||
బతుకు పోరాట దారుల్లో నీడనిచ్చి సేదదీర్చు వృక్షం నేస్తం, ||
స్నేహమంటే కరగని కల, నేస్తమంటే విరగని అల ||
తేనె కన్నా తీయనైనది, మల్లె కన్నా తెల్ల నైనది, ||
మంచు కన్నా చల్లనైనది, రాగంలో అనురాగం స్నేహం ||
శూన్యమైన జీవితాన, విరిసే నవ్వుల వాన స్నేహం ||
తనువులు వేరైనా,తలపులు వేరైనా ||
మతమేదైనా, కులమేదైనా, రాజు కైనా పేద కైనా, ||
ఎల్లలెరుగక, కల్లలు లేక కలకాలం నిలిచేదే స్నేహం ||
జన్మకి వీడుకోలు చెప్పేవరకూ కమ్మని బంధమై విడిపోదు. ||
నమ్మకాన్ని కొంత, అమ్మతనాన్ని కొంత రంగరించి ||
ప్రాణమున్నంతవరకూ నాన్నలా లాలించేది నేస్తం, ||
లేదు స్నేహాన్ని మించిన ధనం, లేదు స్నేహాన్ని మించిన గొప్పతనం ||
నేస్తమున్న జీవితం బంగారం, ||
స్నేహితులు లేని వాడు పేదవానితో సమానం ||
స్నేహం మనుషులను కాదు, జంతువుల మధ్యన కూడా చూడవచ్చు||
అందుకు ఉదాహరణ ఈ చిత్రం, కదా ఒక విచిత్రం ||
మనుషుల మనసులు కలుషితం కావచ్చు, స్నేహం నిలబడకపోవచ్చు||
కానీ జంతువుల మనసులు ఎప్పటికీ కల్మషం కావు ||
కాబట్టి జంతువుల మధ్య అనుబంధం కలకాలం నిలవగలదు ||
అలాగే మనిషికి జంతువులకి మధ్యన అనుబంధం కూడా ||
స్నేహమా వర్ధిల్లు!సమతా మమతల చక్రాలపై చిరంతరంగా
చిత్రంలోని వానరం కాలభైరవునికి నేస్తం మార్జాలమిత్రం ||
ఒకరు అనుకరణకు ప్రతీక, ఒక్క క్రోమో జోముతగ్గించుకొని ||
మనిషిగా కాకుండా వానరంగాగా మిగిలిపోయిన అదృష్ట జీవి ||
నమ్మకానికివిశ్వాసానికి మారుపేరైన గ్రామ సింహం ||
దాన్ని చూస్తే భయపడే ఒక చిన్న బిడాలం ||
ఉప్పూ నిప్పైన రెంటిని అక్కున చేర్చుకున్న వానరానికి జోహార్ ||
ఆ ముగ్గురు చెలి మికి శతకోటి వందనాలు ||
వారి స్నేహాన్ని చూసి ఇకనైనా మనుషులు ||
వారి ప్రవర్తన మార్చుకుంటారని ఆశిద్దాం ||
సమతా మమత పెరుగుతాయని కలలు కాద్దం ||

  • డా. కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి
    విశాఖపట్నం
0Shares