పర్యావరణ పరికిణీలు

వసంత ఆగమనంతో మొదలు షడ్రుచులు నూతన వత్సరాన మెరిసే తారకలు
మానవ మనుగడకై వెలిగే కుండలాలు మైమరపించే మధురానుభూతుల ఉత్సవాలు
కారాల హాహాకారాల కావడికుండలు
సంసార సాగరంలో పులుపుల పులకింతలు మెదడును పదునుచేసే చేదు అనుభవాలు జ్ఞాపకాల దొంతరల వగరు వయ్యారాలు లవణం నేర్పే జీవన స్థిరాంకాలు
ఆరు ఋతువులకు అనుసంధానకర్తలు ఆహార ఆహార్యాలకు పౌష్టిక నిలయాలు
కళకళలాడే కళ్యాణ కమనీయ
కుంకుమరేఖలు
నలభీమపాకాలు నాణ్యతకు చిహ్నాలు పరమాత్ముని సన్నిధాన అన్నదాన సత్రాలు
గంగానది ఒడ్డున పిండ ప్రదానాలు
ప్రయాగలో ఆచరించే పితృదేవతలకు తర్పణలు
అందచందాల ఆనంద అపురూప ఆణిముత్యాలు
దేవదేవేరి పాణిగ్రహణ వర్ణాల తలంబ్రాలు రుచుల రాణులకు రచించిన ఆవేశాలు జీవుల శక్తిసామర్థ్యాలకు ఆహార పీఠికలు స్వీయ త్రికోణ బంధానికి సుస్వరాలు నిలకడగా నిలబెట్టే ఉచ్చ నిశ్వాసాలు
ధరణి గర్భాన జనియించిన మాణిక్యాలు
పుడమిపై పరిచిన పర్యావరణ పరికిణీలు.

  • డాక్టర్ ఎం. ఎన్. బృంద
    అనంతపురము
0Shares