మౌనము*తాను

  • యామిని కోళ్ళూరు

అందం కన్నా మిన్నైన సుగుణము
అంతరాన లేదు ఏరకమైన కల్మషము
అలా చూపులతో పెనవేసుకున్న సాన్నిహిత్యము
అరమరికలు లేకుండా కలసిన వైనము
అందరిని అలరించేలా స్నేహతత్వము

ప్రాణమున్న పలుకలేని మూగజీవాలు
మూడు కూడావేర్వేరు జాతులు
ఏ మాత్రం దరిచేరనీయని పొరపొచ్చాలు
ఎన్నాళ్ళైన ఒకరికొకరమనే చేసే యోచనలు
ఏ జన్మబంధ మోననేలా కలిసిన క్షణాలు….

మనఘలని మించిన వాటి జ్ఞానము
మనమున లేదు ఏ క్రూరత్వము
మదిలోని మాటని తెలుపలేని మూగతనము
ముచ్చటగా ఒకచోట ఒదిగిన ఔన్నత్యము
మనుఘులనే ఔరా అనిపించేలా వాటి దృశ్యము…

కలతలు లేక ప్రేమతో మెలగాలనే వాటి నిర్ణయము
కరుణతో జాలి చూపమనేలా వాటి హావభావము
లోకంలో అందరితోపాటు మేమనేలా మౌనము
అర్ధం పర్ధంలేని అపార్ధాలు లేవనే ఆ నిశ్శబ్దము…

ఏదిఏమైనా మమ్మల్ని గమనించుకో మానవా
ఏ జీవి జీవనము‌ ఎంత వరకో విధి విధానము
ఏ జీవి ఆయుషు ఎన్ని దినాలో అనే దేహాము
ఏ నిమిషము ఆగునో ప్రాణమని చూసేటి దైన్యము.

యామిని కోళ్ళూరు

0Shares