ప్రేమే… మా లక్షణం
– డా. పొట్లూరి రవి కిరణ్!!

జాతి వైరమే లేదు…జన్మ కోరినది కాదు!!
జంతువులము మేము… జగడాలెరుగము మేము!!
ఆజన్మ శతృత్వమంటారు అందరూ!!
ఆ జన్మ మైత్రి కోసమే…అంటాము మేము!!
జాతి వేరైన…జక్కలించము మేము!!
జాతి వైరమెంచి…వెక్కిరించము మేము!!
ప్రాంతమేదైన…ప్రాణ మిత్రులమే!!
ప్రాభవమేదైన…ప్రేమ మూర్తులమే!!
కులము లేదు మాకు…కుళ్ళు కాన రాదు!!
మతము లేదు మాకు…మాత్సర్యమే లేదు!!
వర్ణమెరుగము మేము...మర్మమెరుగము!!
వర్గమెరుగము మేము…వేరు కాము!!
కలిసి మెలిసి ఉంటాము…కలతలు లేక!!
కలిసి మెసలుతుంటాము…కొలతలు లేక!!
ప్రకృతి మాలో…ప్రవర్థిల్లు ప్రతీ క్షణం!!
ప్రకృతి మాతలో…ప్రభవించే ప్రతీ క్షణం!!
ప్రేమే… మా లక్షణం!!
ప్రేమే… మాలో విలక్షణం!!
- డా. పొట్లూరి రవి కిరణ్
పోరంకి