జంతువులే నయం!

-- డా.పివిఎల్ సుబ్బారావు.

వానర, జాగిల ,
మార్జాల త్రయం!

జాతిభేదం,
మరిచి ఒకటైన వైనం!

నేడు ముగ్గురు మనుషులు, ఒకటైతే అద్భుతం!

ఏ ఇద్దరి మధ్య
ఏకాభిప్రాయం ఓ అనృతం!

మనుషులంతా ,
ఎవరికి వారే యమునా తీరే!

కోతి నుండి పుట్టాడు,
మనిషి అంటారు!

వానరుడే నయమని అంగీకరిస్తున్నారు అందరూ!

తోక ఒక్కటి తక్కువ ,
అన్ని ఆ అవలక్షణాలే!

హనుమంతుడు ,
ఎదిగిన ఆదర్శవానరుడు!

మరి కోతి కన్నా ,
దిగజారాడు ఈ మానవుడు!

కుక్కకి ఉన్న విశ్వాసము, విశ్వాన విఖ్యాతము!

మనిషి కుక్కని నమ్మితే జీవితాంతము స్నేహము!

మనిషి మనిషిని నమ్మితే అడుగడుగునా ద్రోహము!

అన్నం పెట్టిన వాడికి,
ప్రాణం పెట్టేది ఒక్క కుక్కే!

ప్రాణం పెట్టినా మనిషి
అన్నం పెట్టడు గొప్ప చిక్కే!

పిల్లికి పాలు పోస్తే,
మన ఇంటే ఉంటుంది !

ఎలకల్ని పట్టి,
ఎంతో మేలు చేస్తుంది!

పిల్లలతో కలిసి,
ఇల్లంతా తిరుగుతుంది!

మన పిల్లలకు చేరువై,
ఎంతో మురిపిస్తుంది!

చిన్న మొహంతో ఉన్న ,
పెద్ధపులి మన ఇంటి పిల్లి!

జంతు ప్రపంచాన,
మనిషికే వింత పోకడే!

స్వధర్మాలు మరిచిన,
జీవి వాడు ఒక్కడే!
యుగాలుమారినా,మారనివి,
జంతువుల స్వభావాలే!

జీవ పరిణామం,
మానవ నాగరికతా వికాసం!

మానవత్వం ఏ మాత్రం ?
వీడని గొప్ప సందేహం!

డా పివిఎల్ సుబ్బారావు.
విజయనగరం.

0Shares