‘శ్రీనారా’ నానీలు
హిందుత్వం – భారతీయం

హిందుత్వమంటే
అందరికీ మంటే
అది ధర్మనిరపేక్షణం
సర్వ సామాన్యం. .. ౧
హిందుత్వం
ఉదారవాదిత్వం
సహిష్ణుతత్వం
స్వాభావిక నియతి. .. ౨
హిందుత్వం
ఉక్తుల పర్యాయ వాచకం
ప్రకృతి ధర్మం
ప్రాకృతిక జీవనం. .. ..౩
బహు సంస్కృతీ వాదం
సార్వభౌమికత్వం
జాతి ఏకీకృతం
భారతీకరణం. .. .. .. .. ౪
జాతీయ అవధారణం
ధర్మ రాజ్యం
ఏకాత్మ మానవత్వం
శాశ్వత సందేశం. .. .. ౫
భారతీజ్ఞాన ప్రణాళీ
శాశ్వతం
మానవత్వ వాస్తవిక జ్ఞాన
పూర్ణత్వం. … … … ౬
సంవాద పరంపర
పున: ప్రతిష్ఠ
భారతీయ జీవత్వ
అభినివేశం. … … ౭*
శ్రీపెరంబుదూరు నారాయణ రావు,
‘శ్రీనారా’
హైదరాబాద్.