డా. భమిడిమల్లి కమలాదేవి నానీలు
శాసనసభ

1.
విసిరిన మైకులు
విరిగిన కుర్చీలు
శాసనసభే
కార్యం శూన్యం
2.
పెట్టుకుంది
శాసనసభ
నవజంట
ఉండాలావిడిపోవాలా
3.
నడుస్తోంది
ప్రకృతిశాసనసభ
భవితగురించి
చర్చలు
4
గిన్నెల చప్పుళ్లతో
నడుస్తోంది
శాసనసభ
ఇల్లాలేస్పీకరు
5.
ఓట్ల బేరీజులే
శాసనసభల్లో
యోచన
ఓట్లబేరానికి
— డా. భమిడిమల్లి కమలాదేవి