పద్మావతి నానీలు

పెళ్ళి!

1.
ధర్మేచ కామేచ
తాళి కట్టిన బంధం
మారింది మరునాడే
ఉరిత్రాడుగా..

2.
ఇద్దరి కళ్ళు కలిశాయి
నాలుగు కళ్ళై
మూగమనసులు
మాటలు లేక..

3.
మనమిద్దరమూ
జతగా తోడూ నీడగా
సహజీవనం
ఫేస్ బుక్ తో..

4.
తడబడుతున్నాయి
అడుగులు
నిజమేదో తెలియక
పరదా చాటున..

5.
చేతిలో తాళిబొట్టు తో
కడదామా వద్దని
చేతికి కట్నం
అటా ఇటా..

— డా. పి. పద్మావతి,
హైదరాబాద్

0Shares