కమల శ్రీ నానీలు

1.
ఎరువుల మందు
ఎదురు తిరిగింది
రైతు గొంతులోకి
దిగనని!
2
గుప్పెడంత గుండెలో
గదులు నాలుగే
సంఘంలో బతికేందుకు
దారులెన్నో!
3.
నీ కాళ్ళ చెప్పులు
మెరిశాయా
వాళ్ళ జీవితాలు
రంగు వెలిశాయి!
4.
మనిషి మానవతను
మరిచాడు
అనాధ వృద్ధులు
అధికమయ్యారు!
5.
తెల్లారని జీవితాల్లో
రంగులెక్కువ
తెల్లారిన బతుకుల్లో
బాధలెన్నో!
— ఆళ్ళ నాగేశ్వరరావు