విలువల వలువ వలవల…

మారుతున్న కాలపు జోరు,
జారుతున్న విలువల తీరు,
దిగజారుతున్న సంస్కృతీ సంప్రదాయాలు,
పతనమవుతున్న వలువల విలువలు,
అంతరిక్ష పయనం చేసిన మానవుడు,
పద్ధతులకు తిలోదకలిచ్చి పతనమవుతున్నాడు,
ఆటవికునిగా మారుతున్న కుసంస్కార నాగరికుడు,
మంచి చదువులు చదువుతారు,
పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు,
బుద్ధి జ్ఞానం మాత్రం కొంచమైనా వుండదు,
అహం నరనరాన నిండగా,
ఒళ్ళు మరచి తనకు తానే మేటియని తలచుచూ
తుండు గుడ్డయే ఫ్యాషననుచు,
వస్తువులు కొనడానికి బండి ఎక్కి, నేరుగా దుకాణానికి వచ్చి,
ప్రదర్శనలిచ్చు మానవ మృగము కాదె!
నిండుగా దుస్తులు ధరించి కాలము పోయె,
నవీనకరణ పేరు మీద బట్టలు చించుకుని,
రంధ్రాల దుస్తులు వేసుకుని కొందరు,
జానెడు బెత్తెడు గుడ్డలు కట్టుకుని,
బిచ్చగాండ్ల కన్నా హీనంగా కనిపిస్తూ,
హేయంగా కాయ ప్రదర్శన చేస్తూ,
అసభ్యకరంగా బండి మీద తిరుగుతూ,
వెర్రి వేయి విధాలన్నట్లు,
పిచ్చి ముదిరినట్లు,
అంగాంగ ప్రదర్శన చేస్తూ,
మురికి నాగరికతకు నాంది పలుకుతూ,
చిన్నా పెద్దా తేడా లేకుండా,
వెకిలి చేష్టలు చేస్తూంటే,
భరతమాత భోరున విలపించదా?
మనం కోరుకున్న నాగరికత ఇదా!మనం ఆశించే సభ్యత్వ సంస్కారం ఇదా!
అందుకే కళ్లు తెరవాలి యువత,
నిర్మించుకోవాలి మంచి భవిత…

  • పంతుల లలిత
    నీలాంజన
    విశాఖపట్నం
0Shares