అలసిన బ్రతుకులు

అలిసిన బ్రతుకులకు ఓ కొత్త లోకం రచించేదెవరు చిరిగిన చెరుగును యింకా చించేవారే గాని,

అలసిన బ్రతుకుల అడుగులు పడేదెటు వైపు అంతా తమాషా చూచేవారే గాని,

ఫ్లాప్ సినిమా హీరో హీరోయే యగు సాంత్వన తెలుపు వారెవరు నవ్విపోదురే గాని,

ప్రేమలో ఓడినంత మాత్రాన వారు ప్రేమికులు కారా పరిహారం తెలిపేదెవరు పరిహసించుదురే గాని,

వేగంగా అడుగులు వేస్తూ ఇంటి దారి పట్టన అమ్మాయి, అమ్మా ! అని పడిపోయినదేమి?

వణుకుతున్న చేతులతో డబ్బ లెక్కిస్తున్న ముసలి బిచ్చగాని చూచి వాడటూ యిటూ చూస్తున్నాడు వడేంటి అదును చూచి లాక్కుపోవలెననా?

ఒక విఫల రచయిత రచయిత కాడా,
ఆటలో ఓడిన ఆటగాడు ఆటగాడు కాడా,
ఉద్యోగం దొరకనివాడు ఏ ఉద్యోగానికీ పనికి రాడా,

పిల్లలందరూ తండ్రి నుండి ఆస్తులన్నీ దండుకుంటే ఆ తండ్రి అంత మాత్రాన తండ్రి కాడా,

వీరివన్నీ ‘అలసిన బ్రతుకులు’ వారి అలసట బాపేవారే లేరా,

వీరందరికీ దొరికేనా గమ్యము, గమ్యమునకు చేర్చువారే లేరా?

ఎవరు ఎవరికి సాయపడతారు, ఊతమిస్తారు?

ఎవరేమిటి? వారంతా ఒకటై ఒకరికొకరు అండగా నిలవాలి,

చీకటిగా ఉంటే దీపం వెలిగించాలే గాని. ఊరకే గింజుకుంటే యెలా? ఎవరొద్దన్నారని,

‘అలసిన బ్రతుకులు’ ఒకచో కూడి కూరిమి కూర్చుకుంటే ఎవరొద్దన్నారు?

అదియే సరియైన సమాధానం-సరియైన పరిష్కారం!*

శ్రీపెరంబుదూరు నారాయణ రావు
హైదరాబాద్.

0Shares