డొక్కా సీతమ్మ .. ఈ పేరు ఏపీలో చాలా మందికి తెలియని పేరు. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆ అపర అన్నపూర్ణ పేరు అందరికీ చిర పరిచయం అయ్యింది. అయితే డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్ లు పెట్టాలని మొదట పవన్ కళ్యాణ్ భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో కూడా చర్చించినట్టు సమాచారం.


ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ లు ఆగస్ట్ 15 నుండి ప్రారంభం అయితే తాజాగా ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రారంభించే కాంటీన్లకు పేరు ఖరారు విషయంలో ఒక ఆసక్తికర చర్చ చోటు చేసుకొంది. వీటికి ఎన్టీఆర్ పేరుతో అన్నా కాంటీన్లు అని కొనసాగించాలా, డొక్కా సీతమ్మ గారి పేరు కూడా జోడించాలా అనే చర్చ వచ్చింది. ఈ సందర్భంగా 2019 వరకూ ఉన్న విధంగా అన్నా కాంటీన్లు అని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.


డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో కాంటీన్లకు ఎన్టీఆర్ పేరును కొనసాగించవచ్చని ప్రతిపాదన పవన్ కళ్యాణ్ చేశారు .డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తే ప్రతి విద్యార్థికి సీతమ్మ గొప్పదనం తెలుస్తుందని, పాఠశాల స్థాయిలో విశిష్ట వ్యక్తులు, దాతృత్వం కలిగినవారి పేర్లు మీద పథకాలు ఉండటం వల్ల భావితరాలకు మేలు కలుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
స్కూల్ లో డొక్కా సీతమ్మ గురించి చదివిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తాను పాఠశాల దశలో ఉండగా డొక్కా సీతమ్మ గురించి చదివిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కంబాల కృష్ణమూర్తి రాసిన అమృత వాక్కులు అనే సంకలనాన్ని మా నాన్నగారు తనకు ఇచ్చారని, అందులో డొక్కా సీతమ్మ దాన గుణాన్ని, ఆకలి అన్న వారికి అర్థరాత్రి వేళ కూడా వండివార్చి పెట్టేవారనీ చదివానన్నారు.

అందరి ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అంతర్వేది దర్శనానికి బయలుదేరితే… దారిలో తన ఇంటికి భోజనానికి యాత్రికులు వస్తున్నారని తెలిసి దైవ దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చి ఆకలి తీర్చారని చదివాను. ఆ రోజు నుంచి డొక్కా సీతమ్మ గారి దాతృత్వ భావనలు గుర్తుకు వస్తూనే ఉంటాయని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాలన్న ప్రతిపాదన స్కూలు విద్యార్థులకు భోజనం అందించే పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఉండటం వల్ల భావి తరాలకు విలువలు అందించగలమన్నారు. అలాగే పేదలకు కిలో రూ.2 కు బియ్యం అందించే పథకం తీసుకువచ్చిన ఎన్టీఆర్ గారి పేరుతో అన్నా కాంటీన్లు నిర్వహణ సముచితమన్నారు. అందుకే డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాలని చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పెట్టారు.

0Shares