సేవ భవిష్యత్ ప్రణాళికకు శ్రీకారం

సుప్రసిద్ధ సాహితీ వేత్తలు, ప్రసిద్ధ కవులు, ప్రముఖ రచయితలు,
వర్తమాన రచయితలు , ఔత్సాహిక కవులు, ప్రధానంగా కవయిత్రులు, , రచయితలు, రచయిత్రులు
ఎందరో మహాను బావులు. అందరికీ వందనాలు. అభివందనముతో పాటు స్వాగత సుమాంజలితో
సేవ నుండి ఆహ్వానం పలుకుతున్నాం.


ఐక్యభావంతో సేవకు సహకారం అందించే వారికి ప్రతేకంగా ఇందు మూలంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఒక ఐక్య వేదికగా సేవను తీర్చిదిద్దుతున్నాం. అందరి సహకారాలు తీసుకొంటున్నాం. సమిష్టి కృషిని అందిపుచ్చుకొంటున్నాం. శాఖలు, విభాగాలు వారిగా సేవను విస్తరింపజేస్తున్నాం. సేవ నిర్వాహక వర్గాన్ని బలోపేతం చేయాలనుకొంటున్నాం.
మీరు సాహితీ సంస్థలు.. ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సాంఘీక మాధ్యమాల సమూహాలు నిర్వహించవచ్చు. అయినా .. సేవలో భాగస్వామ్యం కావచ్చు.
సేవలో బాధ్యతలు చేపట్టవచ్చు. అన్ని సంస్థలతో ఐక్య వేదికగా సేవను ఏర్పరచాలన్నదే సేవ ఆలోచన.. ఆశయం. ఆచరణకు శ్రీకారం చుట్టుతున్నాం. సహకరించే వారు పెద్ద స్థాయిలో ఉండవచ్చు. తీరిక లేని పరిస్థితిలో ఉండవచ్చు. అయితే సేవ చేయాలన్న భావం ఉంటుంది. అలాంటి వారు కూడా తమ వీలును బట్టి సహకారం అందించాలని కోరుకొంటున్నాం. సేవలో భాగస్వామ్యం కావాలని కోరుకొంటున్నాం.
నేను సైతం అంటూ ముందుకొస్తే ఇది మహా అద్భుతం అవుతుంది. ఒక వ్యక్తిగా వస్తే మీరు సైతం ఒక శక్తిగా అవతరిస్తారు. ఇదొక చరిత్ర అవుతుంది. ఇది సేవ నిరూపించిందని చెప్పాలి.
365 రోజుల్లో సేవ చేసింది చాలా స్వల్పమే. అతి తక్కువే. సేవ అక్షర తోరణం ఒక చరిత్ర సృష్టించిందని వేయి నోళ్ళ కొనియాడుతున్నా వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం ఒక ఏడాదితో పూర్తయ్యే పని కాదు. ఇది ఆరంభం మాత్రమే.. చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో.. ఎన్నెన్నో వున్నాయి. కష్టేఫలే కష్టపడితే ఏదైనా సాధించగలం. దాని ఫలితాలు దానంతట అవే వస్తాయి. ఇది ‘సేవ’ నమ్మిన సిద్ధాంతం.
భాషా, సాహితీ ప్రముఖులు, సాహితీ సంస్థల నిర్వాహకులు…
“ఒక లక్ష్యంతో, పట్టుదలతో, నిబద్దతతో,
సేవ నిబంధనలకు కట్టుబడి,
నిస్వార్ధంతో, స్వచ్చందంగా పనిచేస్తాం.
సేవ కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతాం..”
అంటూ ముందుకొచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం.
సేవ భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం.
సమైక్యంగా ఎంతటి కార్యక్రమైనా సులువుగా చేయగలం. పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహించగలం. సేవకులు వారి వారి బాధ్యతలను స్వచ్చంగా, నిస్వార్ధంగా, ఒక నిబద్ధతతో సక్రమంగా నిర్వహిస్తే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలం.
ఇదే నమ్మకంతో మరో అడుగు ముందుకువేస్తున్నాం. మరో చరిత్ర కు శ్రీకారం చుట్టుతున్నాం.
మీకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం.
మీ హృదయ స్పందన సేవకు సంకల్ప బలం.
వందనములతో
సదా సేవలో,
కంచర్ల సుబ్బానాయుడు,
కన్వీనర్, సేవ ఐక్యవేదిక.
+91 9492666660

0Shares