చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని, ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా సిద్దంగా ఉన్నారని, ఇక ముందు మన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్. అమరనాథ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ సీఎం ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఆయనతో పలు విషయాలప చర్చలు జరిపారు. అనంతపరం మీడియతో మాట్లాడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలపై విరిచుకుపడ్డారు. గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరీ పీల్చుకుని సంతోషంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని బావిస్తున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
త వైసీపీ పాలనలో ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులను ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని, రెండు నెలల నుంచి ప్రజలకు స్వేచ్చ వచ్చినట్లు అయ్యిందని, రాక్షస పాలనకు ప్రజలు చెక్ పెట్టారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పెద్దాయన అని చెప్పుకునే ఓ మాజీ మంత్రి బాధితులు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారని పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు విడుదల చెయ్యడానికి వేగంగా పనులు మొదలైనాయని, అలాగే దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అయిన పోలవం ప్రాజెక్టు పనులు పూర్తి చెయ్యడానికి పూర్తిగా సహకరిస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు మొదలైనాయని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని, కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదే సందర్బంలో మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే ఎన్. అమరనథ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇదే సందర్బంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు.